ఐదో పెళ్లికి సిద్ధమైన 93 ఏళ్ల బిలియనీర్
స్ట్రేలియన్-అమెరికన్ బిలియనీర్, మీడియా మెఘల్ (media mogul)గా పేరు తెచ్చుకున్న దిగ్గజ వ్యాపారవేత్త రూపర్ట్ మర్దోక్ (Rupert Murdoch) మరో సారి వార్తల్లో నిలిచారు. 93 ఏళ్ల వయసులో మరో పెళ్లికి సిద్ధమయ్యారు. తన ప్రియురాలు 67 ఏళ్ల ఎలీనా జుకోవా (Elena Zhukova)ను ఐదో పెళ్లి చేసుకోబోతున్నారు (marry for fifth time).
కాగా, ఈ జంట ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు అమెరికా మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వృద్ధ జంట వివాహం చేసుకోబోతోందంటూ స్థానిక మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి. ఈ ఏడాది జూన్లో కాలిఫోర్నియాలోని మార్దోక్ ఎస్టేట్లో వీరి వివాహం జరగనున్నట్లు సదరు కథనాలు పేర్కొంటున్నాయి. పెళ్లి పనులు కూడా మొదలు పెట్టారని, ఆహ్వానాలు కూడా పంపించారని తెలిసింది.