సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్.
సిపిఐ కార్యాలయంలో బాల సంఘం మొదటి సమావేశం
( వకుళాభరణం భానుప్రకాష్ ప్రజాతీర్పు బ్యూరో కరీంనగర్ జులై 21 )
పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వారిలో మానసిక ధైర్యం నింపడానికి బాల్యం నుండే దేశం, సమాజం పట్ల, పెద్దలను గౌరవించే విధానాన్ని తల్లిదండ్రులతో పాటు పిల్లలకు అవగాహన కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఉపాధ్యాయులను కోరారు. ఆదివారం సిపిఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో బాల సంఘం మొదటి సమావేశం కొత్తపెల్లి సాన్విత అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ మాట్లాడుతూ చిన్నతనం నుండే పిల్లల్లో మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని నింపాలని, విద్యతోపాటు వినయాన్ని నేర్పించాలని సూచించారు. రంగంలోనైతే పిల్లలు ఉత్సాహంగా ఉంటారో వారికి ఆ రంగాన్ని ఎంచుకునే స్వేచ్ఛను ఇవ్వాలని అన్నారు. క్రీడలతో పాటు,సంగీతం,కరాటే, క్విజ్ పోటీలు,జనరల్ నాలెడ్జిని వారికి నేర్పించాలని,సమాజం, దేశం పట్ల అవగాహన కల్పిస్తూ,పెద్దలను గౌరవించే విధానాన్ని నేర్పించాలని పేర్కొన్నారు. నేటి బాలలే రేపటి ఉత్తమ పౌరులుగా తయారవ్వడానికి చిన్నతనం నుండే పునాది వేయాలని,మానవ సంబంధాల పట్ల,ఇతరుల పట్ల గౌరవ మర్యాదలను నేర్పించాలని అన్నారు. క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని నేర్పించడానికి , పిల్లల్లో మానసిక స్థైర్యాన్ని నింపడానికి గతంలో భారత కమ్యూనిస్టు పార్టీకి అనుబంధంగా బాల సంఘం ఉండేదని అన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో బాల సంఘాన్ని పునరుద్ధరణ చేయడానికి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వాటిని ఏఐవైఎఫ్ నాయకత్వం ముందుకు తీసుకువెళ్లాలని,ప్రత్యేక చొరవ తీసుకొని బాల సంఘాన్ని నడిపించాలని పంజాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బ్రామండ్లపెల్లి యుగేందర్ మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వారిని చదివిస్తున్నారని,కేవలం చదువు మాత్రమే కాకుండా పిల్లలకు ఇష్టమైన రంగాలను ఎంచుకోవడానికి తల్లిదండ్రులు వారిపై ఎలాంటి ఒత్తిడి తేకూడదనితెలిపారు. వారిని ఉన్నత స్థాయిలో చూడడానికి తల్లిదండ్రులతో పాటు విద్యాబుద్ధులు నేర్పే అధ్యాపకులు కూడా పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, సమాజంలో బాల కార్మికుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని యుగేందర్ అన్నారు. ఈ సమావేశంలో బాల సంఘం సభ్యులు బి కారల్ మార్క్స్, పి ప్రజ్వల్, బి సుకృత షర్మీ, కె సాన్విత,బి.సాహు మహరాజ్, సి హెచ్ సన్నిహిత,బి సంహిత్, కె ప్రజ్ఞస్తి,వి జయదీప్ దక్షిత్, ఎల్ క్రాంత్ కాశీ కె పవిత్ర శ్రీ వర్ధన్ చారి, జి ప్రణీత్ తదితరులు పాల్గొన్నారు.
Discover more from
Subscribe to get the latest posts sent to your email.
