Saturday, January 10, 2026
advt
Homeతాజా వార్తలుసవాళ్ల రోడ్డుపై కారు

సవాళ్ల రోడ్డుపై కారు

కాంగ్రెస్, బీజేపీతో ఏకకాలంలో బీఆర్ ఎస్ పోరు
విచారణల పేరుతో ఇబ్బంది పెడుతున్న రేవంత్ సర్కారు
కవిత సమాంతర కార్యక్రమాలతో కొత్త తలనొప్పి
కేసీఆర్ పై బీఆర్ఎస్ శ్రేణులకు సడలని విశ్వాసం
కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత
భవిష్యత్తు తమదేనని గులాబీ సైన్యం ధీమా

హైదరాబాద్, ఆగస్టు 13 (ప్రజాతీర్పు)

తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా 2001లో ఏర్పాటైంది. అనేక పోరాటాలు చేసి లక్ష్యాన్ని సాధించింది. ప్రత్యేక రాష్ట్రంలో వరుసగా రెండుసార్లు అధకారంలోకి వచ్చి.. పదేళ్లపాటు రాష్ట్రాన్ని పాలించింది. ఉద్యమ ఆకాంక్షలకు, దశాబ్దాలుగా అణచివేతకు గురైన తెలంగాణ ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేసింది. రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తుతో రైతులను, కల్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలతో మహిళలను ఆదుకోవడంతోపాటు కాళేశ్వరం వంటి దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంతో.. ఎడారి లాంటి తెలంగాణను సస్యశ్యామలం చేసింది. అంతర్జాతీయ స్థాయి ఐటీ కంపెనీలను రాజధాని హైదరాబాద్ కు రప్పించి నగరాన్ని ప్రపంచపటంలో నిలిపింది. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించింది. మొత్తంగా ఎలాంటి తెలంగాణను చూడాలని ప్రజలు కలలు కన్నారో.. అలాంటి తెలంగాణను పదేళ్లలోనే సాకారం చేసి చూపించింది. ఉద్యమ సారథిగా ప్రజలను ముందుండి నడిపించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో అనతికాలంలో దేశం మొత్తాన్ని తెలంగాణ వైపు చూసేలా చేసింది తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుత భారత రాష్ట్ర సమితి) . కానీ, అప్పటిదాకా రాకెట్ వేగంతో దూసుకుపోయిన బీఆర్ఎస్ కారు.. ఒకే ఒక్క అనూహ్య ఓటమితో ఒక్కసారిగా గుంతల రోడ్డుపై ఇరుక్కుపోయింది. రెండు జాతీయ పార్టీల నుంచి నిత్యం ఎదురవుతున్న సవాళ్లు, అంతర్గత సమస్యలతో సతమతమవుతోంది. ఔను.. ఉద్యమంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని నిలిచి గెలిచిన బీఆర్ఎస్ ఇప్పడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ తో, కేంద్రంలోని అధికార పార్టీ అయిన బీజేపీతో సవాళ్లను ఎదుర్కొంటోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను తప్పుబడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం విచారణల మీద విచారణలు చేయిస్తోంది. ఏదో ఒక రకంగా కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను అభాసుపాలు చేయడమే లక్ష్యంగా ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. పోలీసు శాఖ చేసే ఫోన్ ట్యాపింగ్ ను నేరంగా చూపించి.. అందుకు కేసీఆర్ ను, నాటి మంత్రి కేటీఆర్ ను బాధ్యులనుచేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంద. నిజానికి శాంతిభద్రతల పరరక్షణలో భాగంగా సంఘవిద్రోహ శక్తుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రభుత్వాలు అధికారికంగానే ఫోన్ ట్యాపింగ్ చేస్తాయి. దీనిని నాటి బీఆర్ఎస్ సర్కారు కూడా అనుసరించింది. కేసీఆర్ సర్కారు ఈ పేరుతో కొందరు ప్రముఖుల ఫోన్లను ట్యాప్ చేయించిందని, తద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని కాంగ్రెస్ ప్రభుత్వం కేసు పెట్టింది. దీనిపై సిట్ ను ఏర్పాటు చేసి విచారణ జరుపుతోంది. కొందరు పోలీసు ఉన్నతాధికారులను నిందితులుగా చేర్చి విచారణ కొనసాగిస్తోంది. కానీ, అంతిమంగా కేసీఆర్ కుటుంబం లక్ష్యంగానే ఈ విచారణసాగుతోంది. అయితే తమపై వస్తున్న ఆరోపణల్ని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వస్తోంది.పార్టీ శ్రేణుల్లో స్థయిర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తోంది.
తెలంగాణను సస్యశ్యామలం చేసినా..
వలసవాదుల పాలనలో బీడుబారిన తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ అపర భగీరథుడిగా మారి కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టారు. మూడు బ్యారేజీలు, పలు రిజర్వాయర్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టుతో.. ఎండిపోయిన చెరువుల్లో నీళ్లు సాక్షాత్కరించాయి. వేసవిలో చుక్క నీరు కూడా దొరక్క అల్లాడి పోయిన తెలంగాణలో మండుటెండల్లో సైతం గోదావరి నీరు ప్రవహించింది. అడుగంట పోయిన భూగర్భ జలాలు భూమిపైకి ఉబికి వచ్చాయి. లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చాయి. ఒకప్పుడు ఎక్కడ చూసినా పగుళ్లు బారిన నేలలు.. పచ్చటి పైరుతో కళకళలాడాయి. కానీ, 2023 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు మేడిగడ్డ బ్యారేజీలో ఒకటి, రెండు పిల్లర్లు కుంగిపోయాయి. వాటికి మరమ్మతు చేసే అవకాశం ఉన్నా.. ఎన్నికల కోడ్ రావడంతో పనులకు అడ్డంకిగా మారింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలై కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకే గ్రహణం పట్టింది.
కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకున్న కాంగ్రెస్ సర్కారు దీన్కొక అస్త్రంగా మార్చుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు, అవినీతి జరిగాయంటూ రేవంత్ సర్కారు విచారణ కమిషన్ ను నియమించింది. రిటైర్డ్ జడ్జి పినాకిచంద్ర ఘోష్ సారథ్యంలోని ఈ కమిషన్ సుదీర్ఘ కాలం విచారణ జరిపింది. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ కు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడల్లా పీసీ ఘోష్ కమిషన్ నుంచి ఏదో ఒక అంశాన్ని లీక్ చేయిస్తూ బీఆర్ఎస్ ను కట్టడి చేసేందుకు రేవంత్ సర్కారు దీనిని వాడుకుంది. కమిషన్ నివేదిక సమర్పించాక కూడా అదే జరుగుతోంది. నివేదికపై అధ్యయనం పేరుతో కొన్నాళ్లు, మంత్రివర్గంలో చర్చించే పేరుతో మరికొన్నాళ్లు, అసెంబ్లీలో చర్చకు పెట్టే పేరుతో ఇంకొన్నాళ్లు.. ఇలా విచారణను ప్రభుత్వం సాగదీస్తోందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇదంతా తమపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపించేందుకేనని మండిపడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న వేళ.. తమను ఆత్మరక్షణలో పడవేసేలా రేవంత్ సర్కారు ప్రవర్తిస్తోందని చెబుతున్నారు. తమపై ఈ ఆరోపణల్ని కొనసాగిస్తూ స్థానిక ఎన్నికల్లో ప్రయోజనం పొందేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు ఉన్నాయంటున్నారు. దీంతో ఇందుు దీటుగా బదులిచ్చేలా వ్యూహాలు రచించే పనిలో గులాబీ బాస్ ఉన్నారు. ఆరోపణలకు కౌంటర్ ఇస్తూనే ప్రజలకు వాస్తవాలు తెలియజేందుకు బీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నిస్తోంది.
ఎమ్మెల్యేల వలసలకు అడ్డుకట్ట..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే బీఆర్ఎస్ పై ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రయోగించింది. దీంతో 10 మంది ఎమ్మెల్యేలు కారు దిగి.. కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. దీనిపై బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడింది. అయితే ఆ పార్టీ అధికారంలో ఉన్నపదేళ్లలో కాంగ్రెస్, టీడీపీ సహా పలు పార్టీల నుంచి ఎమ్మెల్యేలను, ఇతర ప్రజాప్రతినిధులను పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ లో చేర్చుకుంది. అప్పడు ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్ పూర్తిగా నిర్వీర్యమయింది. దీంతో ప్రస్తుతం అందుకు ప్రతీకారమన్నట్లుగా కాంగ్రెస్ చేపట్టినఎమ్మెల్యేల కొనుగోలునుఎవరూ తప్పుబట్టని పరిస్థిత నెలకొంది. కానీ, బీఆర్ఎస్ నాయకత్వం న్యాయస్థానాన్ని ఆశ్రయించి.. వారి సభ్యత్వాన్ని రద్దు చేయించే ప్రయత్నిస్తోంది. తద్వారా మిగిలిన ఎమ్మెల్యేలెవరూ పార్టీని వీడకుండా అడ్డుకోగలిగింది.
డాట‌ర్ స్ట్రోక్ తో త‌ల‌నొప్పి..
కాంగ్రెస్ పన్నుతున్న వ్యూహాలను సమర్థంగా తిప్పికొడుతూ పార్టీ శ్రేణుల్లో స్థయిర్యం పెంచేందుకు ప్రయత్నిస్తున్న బీఆర్ఎస్ పెద్దలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూపంలో కొత్త తలనొప్పి మొదలైంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో జైలుకెళ్లి.. బెయిల్ పై బయటకు వచ్చాక కవిత.. ఏకంగా తన కుటుంబంపైనే అనధికారిక తిరుగుబాటు ప్రకటించింది.పార్టీ అగ్రనాయత్వంపై ఆరోపణలు చేస్తూ కేసీఆర్ కు కంట్లో నలుసులా మారారు. పార్టీలో ఎవరైనాధిక్కార స్వరం వినిపిస్తే తక్షణమే కఠిన చర్యలు తీసుకునే కేసీఆర్.. తన కన్నకూతురి విషయంలోో మాత్రం మౌనంగా ఉండిపోతున్్నారు. పార్టీకి అంతా తానై ముందుకు నడిపిస్తున్న కేటీఆర్ కు ఇది ఇబ్బందికరంగా మారింది. అయితే ఎన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా.. కేసీఆర్ పై పార్టీ శ్రేణులకు అత్యంత విశ్వాసం ఉంది. వ్యూహాలు పన్నడంలో గండర గండడుగా పేరున్న కేసీఆర్ అదను కోసం వేచిచూస్తున్నారు. ఇప్పటకే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిన నేపథ్యంలో దానిని అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ఎంతోకాలం పట్టదని, తెలంగాణలో భవిష్యత్తులో అధికారం తమదేనని గులాబీ శ్రేణులు ఆశాభావంతో ఉన్నాయి.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -advt

Most Popular

Recent Comments