జెలెన్‌స్కీ, గ్రీక్‌ ప్రధాని లక్ష్యంగా క్షిపణి దాడి

కీవ్‌, మార్చి 7: ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, గ్రీక్‌ ప్రధాని కిరియాకోస్‌ మిత్సటాకోస్‌లిద్దరూ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వారి కాన్వాయ్‌ లక్ష్యంగా రష్యా ప్రయోగించిన క్షిపణి కేవలం 500 మీటర్ల దూరంలో పడింది.

నల్లసముద్రం తీరంలోని ఒడెస్సా నగరంలో ఈ సంఘటన చోటు చేసుకున్నది. గ్రీక్‌ ప్రధాని కిరియాకోస్‌ ఉక్రెయిన్‌ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా జెలెన్‌స్కీతో కలిసి నగరం చూడటానికి బయల్దేరారు. ఈ సమయంలోనే క్షిపణి దాడి జరిగింది. ఈ దాడిలో ఐదుగురు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *