Wednesday, January 7, 2026
advt
Homeతెలంగాణస్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి

స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి

మాజీ ఎమ్మెల్యేరసమయి బాలకిషన్

కొప్పరపు రాజిరెడ్డి ప్రజా తీర్పు ప్రతినిధి బెజ్జంకి

మండలకేంద్రంలో ప్రతి గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బిఆర్ఎస్ జండా ఎగరవేయాలని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సోమవారం సత్యార్జున ఫంక్షన్ హాల్ లో భారత రాష్ట్ర సమితి ముఖ్య కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానకొండూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డా రసమయి బాలకిషన్ హాజరయ్యారు. వీరి వెంట రాజన్న సిరిసిల్ల జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిద్ధం వేణు తో కలిసి మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు కోసం కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చార కార్యకర్తల కృషితో పార్టీ బలోపేతం సాధ్యమవుతుందని, ప్రతి ఒక్కరూ పార్టీపట్ల నిబద్ధతతో ఉండాలని ఆయన సూచించారు.
మండలంలో ఇప్పటివరకు 6 ఎంపీపీ స్థానాలకు గాను 2 టీడీపీ,1 కాంగ్రెస్, 3 భారత రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కైవసం చేసుకుందని, పార్టీ మండలంలో ముందు ఉందని తెలిపారు.
కాంగ్రెస్ మోసపూరిత హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిందని, సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తాజా మాజీ ఎంపీపీ శ్రీమతి లింగాల నిర్మలలక్ష్మణ్,నాయకులు కనగండ్ల తిరుపతి, సీనియర్ నాయకులు చింతకింది శ్రీనివాస్ గుప్తా, బోయినపల్లి శ్రీనివాస్ రావు,మాజీ సర్పంచ్లు చింతలపల్లి సంజీవ రెడ్డి, జెల్ల అయిలయ్య, అన్నాడిసత్యనారాయణ రెడ్డి, కనగండ్ల రాజేశం,ఎంపీటీసీ లు దుంబాల రాజా మహేంధర్ రెడ్డి, కోమీరే మల్లేశం, నాయకులు ముక్కిస తిరుపతి రెడ్డి, హన్మండ్ల లక్ష్మారెడ్డి,చెలుకల తిరుపతి రెడ్డి, ముక్కిస రాజిరెడ్డి, నాయకులు ఎల శేఖర్ బాబు, బిగుళ్ళ మోహన్, బిగుళ్ళ దుర్గ సుదర్శన్,కార్యకర్తలు,మాజీ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -advt

Most Popular

Recent Comments