Saturday, January 10, 2026
advt
Homeఆంధ్రప్రదేశ్మావేశానికి ఎందుకు పిలవలేదంటూ కేఏ పాల్‌ నిరసన

మావేశానికి ఎందుకు పిలవలేదంటూ కేఏ పాల్‌ నిరసన

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ (KA Paul ) ఏపీ ఎన్నికల సంఘం తీరుపై నిరసన తెలిపారు. సీఈవో కార్యాలయం మెట్లపై కూర్చుని అధికారుల వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం ముఖ్య అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలకు(Political parties) ఎన్నికల మార్గదర్శకాలను వివరించేందుకు సమావేశానికి రావాలని ఆహ్వానించింది.

అయితే ప్రజాశాంతి పార్టీకి ఎందుకు ఆహ్వానించలేదని పేర్కొంటూ పార్టీ ప్రధాన కార్యదర్శి మమతా రెడ్డితో కలిసి కేఏ పాల్‌ విజయవాడలోని సీఈవో కార్యాలయానికి చేరుకున్నారు. అయిఏత అనుమతి లేదంటూ కేఏ పాల్‌ను అడ్డుకోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం అతడిని లోనికి కార్యాలయంలోకి వెళ్లి కూర్చున్నారు. అక్కడి నుంచి బయట కూర్చోవాలని అనడంతో బయటకు వచ్చి నిరసన తెలిపారు.


Discover more from

Subscribe to get the latest posts sent to your email.

- Advertisment -advt

Most Popular

Recent Comments