సీఎం గారూ.. రైతులంటే మీకు ఎందుకంత చిన్నచూపు..?
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ (X) వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎం గారూ రైతులంటే మీకు ఎందుకంత చిన్నచూపు అని ప్రశ్నించారు. పంటలు ఎండుతున్నా, వడగండ్లు పడుతున్నా.. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారే తప్ప రైతులు గోడు పట్టించుకోవడం లేదెందుకని నిలదీశారు.