విమానం టేకాఫ్‌ కాగానే ఊడిన చక్రం.. వీడియో

అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కో (San Francisco) విమానాశ్రయంలో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. యునైటెడ్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్‌ అయిన కొన్ని క్షణాల్లో దాని టైర్‌ ఊడిపోయింది (flight loses tyre). అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

235 మంది ప్రయాణికులు 14 మంది సిబ్బందితో గురువారం శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి జపాన్‌కు బయల్దేరింది. ఈ క్రమంలో విమానం టేకాఫ్‌ అయిన కొన్ని సెకన్లలోనే ల్యాండింగ్ గేర్‌లో ఎడమవైపు ఉన్న ఆరు చక్రాల్లో ఒకటి ఊడి కిందపడిపోయింది. దీంతో అప్రమత్తమైన పైలట్‌ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. విమానం లాస్‌ ఏంజెల్స్‌ (Los Angeles)లో సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది.

అదృష్టవశాత్తు విమానంలో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. ఘటనపై ఎయిర్‌లైన్స్ సంస్థ కూడా స్పందించింది. ఇలాంటి సందర్భాల్లో సురక్షితంగా లాండయ్యేలా విమానాన్ని డిజైన్ చేసినట్లు వెల్లడించింది. అయితే, ఊడిన విమానం టైర్‌ శాన్‌ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలోని పార్కింగ్‌ ప్రదేశంలో ఉన్న కార్లపై పడింది. దీంతో పలు కార్లు ధ్వంసమయ్యాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *