క్రీడాకారులకు సీఎం శుభాకాంక్షలు
జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడాకారులు, క్రీడాభిమానులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతిని ‘జాతీయ క్రీడా దినోత్సవం’గా జరుపుకోవడం గర్వకారణమన్నారు. “నా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం నా కర్తవ్యం” అన్న ధ్యాన్ చంద్ గారి మాటల స్ఫూర్తితో తెలంగాణ ప్రజాప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, అందులో భాగంగానే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని నెలకొల్పుతున్నామని గుర్తుచేశారు. జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటేలా ఈ యూనివర్సిటీలో ఒలింపిక్ స్టాయి సౌకర్యాలు, శిక్షణ అందించే ఏర్పాట్లు చేస్తున్నామని ముఖ్యమంత్రి గారు ఒక సందేశంలో పేర్కొన్నారు.