కేసీఆర్ ను కలవనున్న కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు. ఉదయం 10:30గంట లకు ఇంటి నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌజ్‌కు ఆమె బయలుదేరనున్నారు.

బెయిల్‌పై విడుదలైన తర్వాత తండ్రిని కలిసేందుకు తొలిసారిగా కవిత వెళుతున్నారు. నిన్న కవిత హైదరాబాద్ చేరుకోగానే ఫోన్ చేసి కూతురుతో కేసీఆర్ మాట్లాడారు. ఈ రోజు లంచ్‌కు రావాలని కవితని ఆయన ఆహ్వానించారు. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణంలో అరెస్ట్ అవడంతో ఐదున్నర నెలల పాటు తిహాడ్ జైలులో ఉన్న కవిత ఈ నెల 27న ఆమెకు బెయిల్ లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *