ఏపీలో పొత్తులపై కొలిక్కిరాని చర్చలు
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మూడుపార్టీల మధ్య సీట్ల సంఖ్యపై చర్చలు కొనసాగుతున్నాయి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ నిన్న రాత్రి ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రి అమిత్ షాతో జరిపిన చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో శుక్రవారం మరోసారి కలవాలని నిర్ణయించుకున్నారు.
ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేనల మధ్య సీట్ల 118 చోట్ల సీట్ల పంపకం పూర్తయింది. వీటిలో టీడీపీ 94 స్థానాలు దక్కించుకోగా జనసేన 24 స్థానాల్లో పోటికి అంగీకారం కుదిరింది. టీడీపీ 12 ఎంపీ స్థానాలు, జనసేన మూడు స్థానాల్లో పోటికి ఒప్పందం జరిగింది. మిగిలిన 10 స్థానాలను రిజర్వ్ చేసుకున్నారు.
నిన్న జరిగిన చర్చల్లో బీజేపీ 6 పార్లమెంట్ , 15 అసెంబ్లీ స్థానాలను కోరుతుండగా 4 పార్లమెంట్, 6 అసెంబ్లీ సీట్లు్ ఇస్తామని టీడీపీ, జనసేన నేతలు సూచించారు. వీటిపై పీఠముడి పడడంతో శుక్రవారం మరోసారి చర్చలు జరుగనున్నాయి. అమిత్ షా పార్టీ కార్యక్రమంలో బిజీ ఉండడంతో ఈరోజు రాత్రి చర్చలు జరిగే అవకాశముందని సమాచారం.